Header Banner

నాన్‌వెజ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! బర్డ్ ఫ్లూ భయం పైన శాస్త్రీయ క్లారిటీ.. ఇక భయం లేదు!

  Sat Apr 19, 2025 16:23        Others

చాలా మంది నాన్‌వెజ్‌ ప్రియులు ఇష్టంగా తినేది చికెన్‌. అధిక ప్రొటిన్‌తో పాటు నోటికి మంచి రుచికరంగా ఉంటుంది. అందుకే చాలా మంది చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు కొందరుంటారు.. వీళ్లు చికెన్‌ను సరదాగా రోజూ తినేస్తారు. ఇలాంటి వాళ్లంతా కొంతకాలంగా గతం కంటే కాస్త తక్కువగా చికెన్‌ తింటున్నారు. మనసులో చికెన్‌ కుమ్మేయాలని ఉన్నా.. బర్డ్‌ ఫ్లూ భయంతో కాస్త తినడం తగ్గించారు. ఇటీవలె కాలంలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సైతం పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే చికెన్ లవర్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టీ.దామోదర నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని భోపాల్‌లోని జాతీయ అత్యున్నత భద్రతా జంతు వ్యాధుల సంస్థ నిర్ధారించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించగా శాంపిల్స్ భోపాల్ పంపించి టెస్ట్ చేయించినట్లు చెప్పారు. పల్నాడులో బర్డ్ ఫ్లూ తో చిన్నారి మృతి చెందిన ప్రాంతంలో 70 మంది శాంపిల్స్ పరీక్షించగా నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. కాబట్టి నాన్‌వెజ్‌ ప్రియులు, ముఖ్యంగా చికెన్‌ అంటే లొట్టలేసుకునేవాళ్లు ఇక భయపడాల్సిన పనిలేదు. చికెన్‌ను ఇష్టమొచ్చినట్లు లాగించేయండి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #BirdFluUpdate #ChickenIsSafe #NonVegLovers #NoMoreFear #AndhraPradesh #FoodSafety